గుంటూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. శనివారం రాత్రి మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఏకంగా ఐదు కిలోల బంగారు నగలు దుండగులు ఎత్తుకెళ్లారు. విజయవాడ నుంచి మంగళగిరికి బైక్‌పై నగలను తీసుకెళ్తుండగా మధ్యలో దుండగులు వచ్చి చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.