వన్డే ఫార్మాట్ లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటే శ్రేయస్‌కు పూనకాలే అన్నట్లుగా తన ఆట తీరు కనబడుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుతో శ్రేయాస్ ఆడిన అన్ని మ్యాచుల్లో వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ చేసి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.