నేడు మౌనీ అమావాస్య. ఏడాదిలో 12కు పైగా అమావాస్యలు వచ్చినప్పటికీ మౌనీ అమావాస్యకు మాత్రం ఎంతో విశిష్టత ఉంది. అయితే ఈ రోజు కొన్ని ప్రత్యేక పనులు చేస్తే ఆ ఇంట్లో దేనికి కొదవ ఉండని పండితులు చెబుతున్నారు. మౌనీ అమావాస్య రోజు పితృదేవతల పేరిట దానధర్మాలు లేదా అతిథులను పిలిచి భోజనం పెట్టడం లాంటి కార్యక్రమాలు చేయాలంట. ఈ పనులు దేవతామూర్తులకు సంతోషం కలిగించడంతో భక్తులకు తమ ఆశీస్సులు అందజేస్తారని వివరిస్తున్నారు.