తెలంగాణ ప్రజలకు BRS MLC కవిత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా HYDలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. 'రాష్ట్ర ప్రజలందరికి హనుమంతుడి అనుగ్రహం లభించాలి. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలి. ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఉండాలి. హనుమంతుడి కృప ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను' అని అన్నారు.