న్యాయ విద్య చదువుతున్న వారికి మనుస్మృతి బోధించాలని వచ్చిన ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. ఢిల్లీ వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి స్వాగతించారు. మనుస్మృతి బోధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని, మను చట్టాలను బోధించేందుకు వర్సిటీ అయిష్టతను వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు.