అహ్మదాబాద్‌లో ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు పైలట్ నుంచి ఏటీసీకి 'మేడే కాల్'(డిస్ట్రెస్ కాల్) వచ్చినట్లు పౌర విమానయానశాఖ వర్గాలు తెలిపాయి.తిరిగి పైలట్లను సంప్రదించే లోపే విషాదం జరిగినట్లు వెల్లడించాయి. మేడే కాల్ అంటే అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడుతారు. ఎమర్జెన్సీ సమయాల్లో 'మేడే' అనే పదాన్ని పైలట్లు మూడుసార్లు చెబుతారని సమాచారం.