TG: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. HYDలో యాంటీ లార్వా కార్యకలాపాలను విస్తృతం చేయాలని చెప్పారు. ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.