రాయికోడ్: మెస్ చార్జీలు పెంపు పట్ల తల్లిదండ్రుల హర్షం
ఉపసంచాలకుల ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం అయిన రాయికోడ్ ఎస్సి వసతి గృహము నందు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం గృహ సంక్షేమాధికారి కృష్ణవంశీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యందు ప్రభుత్వం వసతి గృహ విద్యార్థుల కాస్మొటిక్ , డైట్ చార్జీలను నవంబర్ మాసం నుండి పెంచిన విషయం తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు అందించే సౌకర్యాలు మరింత మెరుగు పరుచుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలపడం జరిగింది.