మెదక్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అన్ని మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వర్ష నమోదు కేంద్రాల సమాచారం మేరకు అత్యధికంగా 38. 6 మీమీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా 35. 5 మీమీ రికార్డు అయింది. మృగశిర కార్తె ఆరంభంలోనే వర్షాలు పడటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.