మొహర్రం పండుగ పురస్కరించుకొని మెదక్ పట్టణంలో ఘనంగా పీర్లను ఊరేగించారు. దాయార నుంచి చమన్ వరకు ర్యాలీగా వచ్చిన పీరు చమన్ లోని పీరును కలుసుకున్నాయి. ఈ రెండు ముస్లిం మత పెద్దలు పీర్లను చమన్ లో నిలిపి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చమన్ ప్రాంతం అంత కూడా జనంతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.