పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నార్సింగి వాసి వేణు ప్రసాద్(35) ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాడు. తల్లితో కలిసి కొంపల్లి పరిధి గాంధీనగర్లో ఉంటున్నాడు. పెళ్లి కావడం లేదని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.