ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు తొలగించారనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మందు తాగాడు. ఈ ఘటన రామాయంపేట మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు. కాట్రియాల గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు వచ్చినప్పటికీ కొందరు నాయకులు తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానానికి పాల్పడినట్లు బుధవారం తెలిపారు.