ఢిల్లీలో బీజేపీ విజయంతో మండల కేంద్రం హవెలి ఘనపూర్ లో బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుతూ. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని శ్రీనివాస్ పేర్కొన్నారు. కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు శ్యామ్, ఉపాధ్యక్షుడు రూపేందర్, నాయకులు శ్రీపాల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.