మెదక్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి.. సుమారు 50 మీటర్లు లాకెళ్ళింది

81చూసినవారు
మెదక్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హవేలి ఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ వివరాల మేరకు. మృతుడు మెదక్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి సుమారు 50 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. రహదారి వెంట సీసీ కెమెరాల ఆధారంగా వాహనం పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఘటన స్థలంలోనే శవ పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్