మెదక్, నర్సింగి మండలాలకు కొత్త ఎంఈఓ లను నియమిస్తూ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ మండల ఎంఈఓ గా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, నార్యంగి మండల విద్యాధికారిగా రెడ్డిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాబాయిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు మండలాల్లో ఎంఏవోలు ఉద్యోగ విరమణ చేయడంతో వీరిని నియమించినట్లు తెలిపారు.