ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

75చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలు నిర్వహించారు. విద్యార్థులందరూ తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వస్త్రధారణతో హాజరై తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి ఆటపాటలతో విద్యార్థులు అలరించారు. లయబద్ధంగా చప్పట్లు వేస్తూ 'రామ రామ ఉయ్యాలో' అంటూ విద్యార్థులు బతుకమ్మ పాటను ఆలపించారు. ప్రతిభ చూపిన చిన్నారులకు బహుమతులను అందించారు.

సంబంధిత పోస్ట్