ఈ నెల 15 నుండి 18 వరకు మల్కాపూర్ లో గ్రామదేవతల జాతర కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఉదయం బొడ్రాయికి జలాభిషేకం, మధ్యాహ్నం ముత్యాలమ్మ, రేణుక మాత, నల్ల పోచమ్మ, కనకదుర్గమ్మలకు బోనాల సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం గ్రామ నడిబొడ్డున ఊరడమ్మ పండగ, మంగళవారం మహంకాళి అమ్మ పండుగ, బుధవారం దుర్గమ్మ పండగ, గావు రంగాలతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.