రామాయంపేట: వాహనదారులకు బ్రీతింగ్ టెస్ట్

76చూసినవారు
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని చౌరస్తా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు శనివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వాహనదారులకు బ్రీతింగ్ టెస్ట్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. బైక్ నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్