చేగుంట మండల కేంద్రంలో సోమవారం ఉపాధ్యాయ సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, రాజ్యాంగ రచనలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో, అనగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడని, గొప్ప ప్రజాస్వామ్యవాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు, తపస్ అధ్యక్షులు మనోహర్ రావు, తదితరులు పాల్గొన్నారు.