గత 16 నెలలుగా పంచాయితీలకు నిధులు విడుదల కాకపోవడంతో, అవసరమైన పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్, బ్లీచింగ్ పౌడర్, పైప్ లైన్లు, స్ట్రీట్‌లైట్లు.. దేనికైనా ఖర్చు పెట్టేందుకు డబ్బుల్లేవని పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. ఇకపై ఆర్థిక భారం భరించలేమని ఎంపీడీవో దామోదర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు.