మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారము అనారోగ్య సమస్యతో బాధపడుతున్న దూదేకుల చోటుకు అత్యవసర చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి తెలియజేయగానే తక్షణమే స్పందించి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్దిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల యూత్ లీడర్ శ్రీకాంత్ రెడ్డి, రవీందర్, శ్రీశైలం, ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు.