10కె రిలే వాకింగ్ పై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. బడిబాట ప్రాముఖ్యతను విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా ఈ వాకింగ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మెదక్ పట్టణంలో ఉన్న పట్టణవాసుల పిల్లలు బడిలో చేరే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.