ఈ విద్యా సంవత్సరం ప్రణాళిక బద్ధంగా 100 శాతం గుణాత్మక విద్య సాధించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం డైట్ కళాశాలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. గణితం, సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్టులను ప్రాథమిక స్థాయి నుంచే గుణాత్మక విద్యా బోధన చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రొ. రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు.