మెదక్ మెడికల్ కళాశాలను గురువారం ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. 50 సీట్లతో మెడికల్ కళాశాల నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా మెడికల్ కళాశాలలో ప్రారంభిస్తామని చెప్పారు.