
TG: కూతురిని చంపిన కేసు.. తల్లికి ఉరి శిక్ష
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతురిని చంపిన కేసులో తల్లి భానోత్ భారతికి కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మతిస్థిమితం లేకపోవడంతో తల్లి భానోత్ భారతి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మోతె మండలం మేకలపాటి తండాలో ఏప్రిల్ 2021లో ఈ దారుణ ఘటన జరిగింది. అప్పటి నుంచి విచారణ జరగుతుండగా.. శుక్రవావారం భానోత్ భారతికి కోర్టు శిక్ష విధించింది.