రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందించినట్లు తెలిపారు. రూ. 22 వేల కోట్లతో రుణమాఫీ, రూ. 8 వేల కోట్లతో రైతు భరోసా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.