మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఆర్థిక సర్వే డాటా ఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తప్పులు దొరలకుండా ఎలిమినేటర్ సహాయంతో డాటా ఎంట్రీని పూర్తి చేయాలని సూచించారు.