చిన్న శంకరంపేట మండలంలోని చెన్నాయపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం, ఉపాధ్యాయురాలు తుడుం కృప, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గొరింటాల పద్మ, వీఓఏ గంట బాలమణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.