

ఓజీ ఓజీ అంటూ నినాదాలు.. మీరు మారరన్న పవన్ (వీడియో)
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటిస్తున్నారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో నీటికుంట నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం వేదికపై మాట్లాడుతుండగా.. అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. దాంతో మీరు మారరు.. సరే కానివ్వండి అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. కాగా, పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.