మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన

0చూసినవారు
మెదక్ జిల్లా రామాయంపేటలో జూనియర్ కళాశాల మైదానంలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమం రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను విడతలవారీగా నిర్వహిస్తామని సీఐ తెలిపారు. యువత క్రీడలపై దృష్టి సారించాలని ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్