పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు శనివారం మంజీరా నది వరద నీటి ప్రవాహం ఉర్దూతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని మూసివేసి రాజగోపురంలో అమ్మవారి ఉత్సావ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.