మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు ఆదివారం మందిరా నది వరద నీటి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆలయ నిర్వాహకులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.