మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ చేసిన దాడిని నిరసిస్తూ ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో తెల్లవారుజామునే పోలీసులు హైదరాబాద్ లో పద్మ దేవేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. హౌస్ అరెస్టును ఆమె ఖండించారు.