మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం జక్కన్నపేటలో గ్రామ దేవతల బోనాల ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనం ఎత్తుకున్నారు. అమ్మవారి దయతో పంటలు బాగా పండాలి, అందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.