పోచమ్మ తల్లికి బోనం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఓడిబియాలి పోసి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్