పెద్దమ్మ తల్లి కి బోనం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
హవెలిఘనపూర్ మండలం రాజీపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ చతుర్థ వార్షికోత్సవంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మహిళలతో కలిసి పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడిపంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్