కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తుందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. నియోజకవర్గంలోని పెళ్లికొట్టల బ్రహ్మ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.