ఆరోగ్యానికి హాని కలిగిస్తే జరిమానాతో పాటు మూసివేస్తాం

85చూసినవారు
ఆరోగ్యానికి హాని కలిగిస్తే జరిమానాతో పాటు మూసివేస్తాం
మెదక్ పట్టణంలోని రెస్టారెంట్లు మరియు హోటల్స్ లలో తనిఖీలు చేపట్టి పాడైపోయిన మరియు ఫ్రిడ్జ్ లలో నిల్వ ఉంచిన కుళ్ళిపోయిన మాంసం కూరగాయలను గుర్తించడం జరిగింది. అందులో భాగంగా రాయల్ మండి రెస్టారెంట్ ₹10, 000, అరేబియన్ మండి రెస్టారెంట్ 5000 రూ, అల్వహీద్ రెస్టారెంట్ కు మూడు వేల రూ, టి20 ఫాస్ట్ ఫుడ్ సెంటర్, టీ స్టాల్ 2000 రూ, బాలాజీ మిఠాయి భండార్ కు వెయ్యి రూపాయల జరిమానా విధించి, దాదాపు 70 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకొని డంపింగ్ యార్డ్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ హోటల్ మరియు రెస్టారెంట్ నిర్వాహకులను హెచ్చరించడం జరిగింది. ఈ తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్