
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదే. దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తవుతుంది’’ అని అన్నారు.