

ఏపీలో భారీ వర్షం (వీడియో)
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఆముదాలవలసలో వర్షం దంచికొడుతోంది. అటు విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, పార్వతీపురం ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు.