చెత్త రహిత జిల్లాగా మారుద్దాం: ఎమ్మెల్యే

264చూసినవారు
చెత్త రహిత జిల్లాగా మారుద్దాం: ఎమ్మెల్యే
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ర్రెడ్డి మెతుకు సీమను చెత్తరహిత జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చారు. కొత్తపల్లి, మినుపూర్ గ్రామాలలో డంపింగ్ యార్డులు, సిసి రోడ్డు, ఈ-పంచాయతీ గ్రంథాలయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గురు మూర్తి గౌడ్, తాసిల్దార్ బలరాం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్