ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలు, పంచాయతీల వారీగా దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు.