జాతీయ అదాలత్ లో 6,039 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. మెదక్ జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 55.90 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.