మెదక్ జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ పొందడానికి 13వ బ్యాచ్ తరగతులు ప్రారంభం కానున్నాయని జిల్లా యువజన క్రీడాలధికారి దామోదర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతి, యువకులు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.