మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మెదక్ లో చదువుకొని అదే స్కూల్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ, పదోన్నతి పై అదే పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రేఖను కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ రాహుల్ రాజ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, మెదక్ మండల విద్యాధికారి నీలకంఠం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.