మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదంమోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగాపని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్ లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాలనిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.