వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి (వీడియో)
అల్లూరి జిల్లాలోని పాడేరులో పర్యాటక ప్రాంతాల వద్ద రద్దీ నెలకొంది. వంజంగి మేఘాల కొండ వద్దకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంది. దీంతో వంజంగి ఘాట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలువురు ప్రకృతి అందాలను తమ సెల్ఫోన్లలో బంధించి మురిసిపోతున్నారు.