మెదక్ విద్యుత్ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ జిల్లా అధికారి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి జయంతి రోజును మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్శించదగ్గ విషయమని పేర్కొన్నారు.