
నిశ్చితార్థానికి ముందు రోజు పురోహితుడు ఆత్మహత్య
AP: నిశ్చితార్థానికి ముందు రోజు పురోహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. వింజమూరి వెంకటేశ్ (30) పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉండేది. నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు.. రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు.