

భారతీయుడిపై అమెరికా అధికారుల కాఠిన్యం.. సంప్రదింపులు జరుపుతన్న CGI
అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో భారతీయ యువకుడిపై భద్రతాధికారులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. యువకుడిని నేలపై పడేసి, చేతులకు బేడీలు వేసి బలవంతంగా భారత్కి పంపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై భారత కాన్సులేట్ జనరల్(CGI) స్పందించింది. వివరాలు సేకరిస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపింది.